Chemical Engineering: కెమికల్ ఇంజినీరింగ్‌తో కెరీర్ కి భరోసా 8 d ago

ఇంటర్ తర్వాత బీటెక్ అంటే మనందరికి తెలసిన గ్రూపులు సివిల్, మెకానికల్, ఎక్ట్రికల్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ లాంటి గ్రూపులే మీ దగ్గరలో ఉన్న చాలా ఇంజినీరింగ్ కాలేజీల్లో కనిపిస్తాయి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని బయటకి వెళ్తున్నారు. అన్ ఎంప్లాయిమెంట్ చూసుకుంటే ఈ బ్రాంచీల్లోనే ఎక్కువగా ఉంటుంది.
కానీ బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ లో నిరుద్యోగం కనిపించదు. ఎందుకంటే జాబ్ సోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. సీట్లు తక్కువగా ఉంటాయి. కొన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లోనే ఈ బ్రాంచీ ఉంటుంది. తెలసిన కొద్ది మంది మాత్రమే జాయిన్ అవుతారు. దీనిలో జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. బీటెక్ లో చాలా బ్రాంచీలు ఉంటే ఈ బ్రాంచి లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? ఇప్పుడు తెలుసుకుందాం…
కెమికల్ ఇంజినీరింగ్ రంగం మెడిసిన్, ఎలక్ట్రానిక్ మెటీరియల్స్, పునురుత్పాదక ఇంధనాలు, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ, సైబర్ ఎనేబుల్డ్ కంప్యుటేషనల్ సిస్టమ్స్, నానోటెక్నాలజీ ఫర్ ఎనర్జీ కన్వర్షన్, మైక్రో ఎలక్ట్రానిక్స్, బయో కెటలిస్ట్స్, టైలర్డ్ మాలిక్యులర్ ప్రొడక్ట్స్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది వివిధ ఇంజినీరింగ్, సైన్స్ విభాగాలతో సంబంధం ఉన్న బ్రాంచి. అందుకే బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ లో నిరుద్యోగం కనిపించదు.
కెమికల్ ఇంజినీరింగ్ తీసుకుంటే...
కెమికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వ, ప్రైవేటు, ఆర్ అండ్ డి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయి. పెట్రోలియం, పెట్రోకెమికల్, బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ, ఎరువులు, ఉక్కు, పాలిమర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పల్ఫ్ అండ్ పేపర్, రసాయనాలు, డిజైన్ నిర్మాణం, ఔషధ, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ ఆరోగ్యం లాంటి విభాగాలు వీరికి ఉపాధినిస్తాయి. డిజైన్ ఇంజినీర్లు, ప్రాసెస్ ఇంజినీర్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్లు, ప్రొడక్షన్ ఇంజినీర్లు, మెయింటెనెన్స్ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు, సేఫ్టీ ఇంజినీర్లు, కన్సల్టెన్సీ సిబ్బంది, ఆడిటింగ్ ఇంజినీర్లు, ఆర్ అండ్ డి శాస్త్రవేత్తలు, సైంటిఫిక్ ఆఫీసర్ల వంటి హోదాల్లో విధులు నిర్వహించవచ్చు.
రాష్ట్రస్ధాయిలో.....
కెమికల్ ఇంజనీరింగ్‌ను ఎంచుకోవాలనుకునే వారు ఇంటర్మీడియట్ స్ధాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూప్ తీసుకొని ఆయా సబ్జెక్టుల్లో మంచి ప్రావీణ్యం ఉండాలి. అన్ని ఇంజినీరింగ్ బ్రాంచ్‌ల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ ద్వారానే కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో ప్రవేశం కల్పిస్తారు.
జాతీయ స్ధాయిలో....
జాతీయ స్ధాయిలో ఐఐటీ, నిట్‌లు కెమికల్ ఇంజినీరింగ్ ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలు జేఈఈ-అడ్వాన్స్‌డ్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
ప్రభుత్వ రంగంలో…
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబ్స్, అటామిక్ ఎనర్జీ, ఐఓసీఎల్, ఓఎన్‌జీసీ, బీసీసీఎల్, ఎన్‌టీపీసీ, హిందూస్ధాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లాంటి వాటిల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి..
ప్రైవేటు రంగంలో….
రిలయన్స్ ఇండస్ట్రస్ లిమిటెడ్, రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్, గోదావరి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, కోరమాండల్ ఎరువులు, అనేక పాలిమర్, ప్లాస్టిక్, స్టీల్, ఔషధ తయారీ సంస్ధలు లాంటి వాటిల్లో అపార అవకాశాలు ఉన్నాయి.
ప్రాంతీయ కంపెనీలుః డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్, ఎంఎన్ఎన్ ఫార్మా లిమిటెడ్, వింధ్య ఫార్మా లిమిటెడ్, జెన్ కెమికల్ కన్సల్టెంట్స్ లిమిటెడ్, ఇతర ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి.
కెమికల్ ఇంజినీరింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ చేసి జాతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్ధల్లో, ఫార్మా , కెమికల్ పరిశ్రమల్లో శాస్త్రవేత్తగా, ఇంజినీరింగ్ కళాశాలల్లో అధ్యాపకులుగా స్ధిరపడవచ్చు. మంచి ఉద్యోగంలో స్ధిరపడాలంటే జాతీయ, అతర్జాతీయ స్ధాయి విద్యాసంస్ధల్లో ప్రవేశం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించుకోవడం అవసరం.
ఇది చదవండి: బయోటెక్నాలజీ రంగంలో... భవిష్యత్ బంగారం!